“ద విచెస్” – తడబడిన రాబర్ట్ జెమెకిస్? (రివ్యూ)

రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించిన “రోల్డ్ దాల్స్ ద విచెస్ (ద విచెస్)” HBO Max లో అక్టోబరు 22 న విడుదలయింది. డార్క్ ఫాంటసీ కామెడీ జానర్ కి చెందిన ఈ చిత్రానికి జెమెకిస్, కెన్యా బారిస్ మరియు గియర్మో డెల్ టోరో రచన అందించగా క్రిస్ రాక్ కథనం వాయిస్ ఓవర్ గా అందించడం జరిగింది. 1983 లో ఒక నవల గా వచ్చిన రోల్డ్ దాల్స్ ద విచెస్ ని 1990 లో నికోలస్ రోయెగ్ మొదటసారిగా అదే పేరుతో సినిమా గా తీయగా ఇప్పుడు వచ్చిన “ద విచెస్” రెండవ సినిమా (మొదటి చిత్రానికి రీమేక్) గా పరిగణించవచ్చు. అన్నే హతావే, ఆక్టేవియా స్పెన్సర్ మరియు స్టాన్లీ టుక్కి ముఖ్య పాత్రలు పోషించిడం జరిగింది.

In Roald Dahl's 1983 novel, The Witches, real witches looked like ordinary women
  • Facebook
  • Twitter
  • reddit

కథ:

1986 లో అలబామా లో తన వారిని కోల్పోయి బామ్మ వద్ద చేరిన ఒక అబ్బాయి ఆ టౌను లో మంత్ర గత్తె నుండి తప్పించుకునే ప్రయత్నం లో బామ్మ తో కలిసి ఒక పెద్ద హోటల్ కి చేరుకుంటాడు. అయితే అదే హోటల్ లో మంత్రగత్తె ల (విచెస్) కాన్ఫరెన్స్ లో చిక్కుకుపోయి అదే క్రమం లో పెద్ద మంత్రగత్తె (గ్రాండ్ హై విచ్) చేతిలో ఎలుక గా మారబడుతాడు. అయితే చిన్నపిల్లలందరినీ ఎలుకలుగా మార్చాలనే విచ్ యొక్క ప్లాన్ తెలుసుకున్న అతను తన బామ్మ, బ్రూనో మరియు మేరీ అనే ఇతర ఎలుకల తో కలిసి ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకున్నాడనేది ముఖ్య కథాంశం.

విశ్లేషణ:

అసలు కథ లో కొన్ని మార్పులు చేసి బ్రిటిష్ కథాంశాన్ని అలబామాకి మార్చిన జెమెకిస్ ముఖ్య పాత్రధారులను కూడా బ్లాక్ పీపుల్ గా మార్చి గ్రాండ్ విచ్ ని యూరోప్ కి చెందినట్టుగా చూపించడం కథ కు అంతగా సరిపోయినట్టు కనిపించదు. ముఖ్యం గా గ్రాండ్ విచ్ పాత్రకి యూరప్ యాస తో కూడిన డైలాగ్స్ పెట్టడం తో అసలు ఆ పాత్ర ఏమి మాట్లాడుతుందో సరిగ్గా అర్థం కాదు ఎవరికీ..

1990 సినిమాలో స్ట్రింగర్ పాత్ర పోషించిన రోవాన్ ఆట్కిన్సన్ పాత్ర క్రియేట్ చేసిన మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించదు సరికదా గ్రాండ్ విచ్ పాత్ర పోషించిన అన్నే హతావే ఆ పాత్ర కు అంతగా సరిపోయినట్టు ఏ నిమిషం లోనూ అనిపించదు.

కథనం బాగున్నా ఇటువంటి సినిమాలో అందరూ ఎదురు చూసే సినీ మ్యాజిక్ కొరత స్పష్టం గా కనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రాణం కేవలం కాన్ఫరెన్స్ హాలు లో జరిగే ఒకే ఒక సన్నివేశం మాత్రమే.. సినిమా మొదలు చప్పగా నిర్జీవం గా కొనసాగి కొంత నిరాశ కలిగిస్తుంది. కథ లో అసలు వేగం గ్రాండ్ విచ్ తన సభ్యులతో హోటల్ లోకి ప్రవేశించినప్పుడు మొదలయినా అది మిగతా సినిమా మొత్తం మోయ బడక పోవడం నిరాశ కలిగిస్తుంది.

గ్రాండ్ విచ్ గా అన్నే హతావే ఒక బ్యాడ్ ఛాయిస్ కాగా ఒక్క ఆక్టేవియా స్పెన్సర్ పాత్ర తప్ప యే ఇతర పాత్రలు అంతగా నప్పనట్టుగా కనిపిస్తాయి. సీజీ మరియు కథనం బాగున్నా రాబర్ట్ జెమెకిస్ మార్కు మ్యాజిక్ మరియు గియర్మో డెల్ టోరో మార్కు రచన మనకి మచ్చుకు కూడా కనిపించకపోవడం ఈ సినిమా లో పెద్ద వెలితి గా చెప్పవచ్చు.

కథ ప్రకారం గ్రాండ్ విచ్ పిల్లలందరినీ ఎలుకలుగా మార్చాలనే ప్రయత్నం ఫ్లాష్ బ్యాక్ లో బామ్మ చెప్పిన తన ఫ్రెండ్ ని కోడి పెట్టగా మార్చిన సన్నివేశం తో పోలిక అసలు కుదరకపోవడం జెమెకిస్ కథ లో చేసిన మార్పులను వెక్కిరిస్తుంది.

https://www.youtube.com/watch?v=clk2ClBOGTM

Was this helpful?

About Author /

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This