సర్ (Sir) – అంతరాలను స్పృశించే హృద్యమైన కథ

రోహెన్ గెరా దర్శకత్వం వహించిన “సర్” మూవీ చూస్తుంటే 1986 లో వచ్చిన కె. విశ్వనాథ్స్వాతి ముత్యం” గుర్తుకొచ్చింది. విధవ అయినటువంటి లలిత (రాధిక) అనుభవించే బాధలను చూడలేక శివయ్య (కమల్ హాసన్) ఒక శ్రీరామ నవమి నాడు తన మెడలో మంగళసూత్రం వేస్తాడు. ఇక్కడ లలిత ఉన్నత కుటుంబానికి చెందినదయితే శివయ్య నిమ్న వర్గానికి చెందిన వాడు.

సర్ మూవీ సినిమా చూస్తుంటే 1986 కు ఇప్పటికీ సమాజం లో అంతగా మార్పు ఏమీ కలగలేదనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కుల మరియు వర్గ విభజన తీవ్రం గా ఆ రోజుల్లోనే స్వాతి ముత్యం వంటి చిత్రం ద్వారా సమాజం లో ఉన్న అస్పృశ్యత ను, విభజనను ఎదుర్కోవడాన్ని శివయ్య పాత్ర ద్వారా ఉన్నతం గా చూపించగల్గిన సాహసం రోహన్ గెరా వంటి దర్శకులు కూడా చూపిస్తే బాగుండేదేమో..

Sir review – sexual tension brews in Mumbai | Cannes 2018 | The Guardian
  • Facebook
  • Twitter
  • reddit

కథ: రత్న (తిలోత్తమ షోమే) చిన్న వయసులోనే భర్త ని కోల్పోయి బ్రతుకుతెరువు కోసం ముంబయి లోని ఒక ఉన్నత కుటుంబం లో పనిమనిషిగా వారింటిలోనే ఉంటూ ఫ్యాషన్ డిజైనర్ కావాలన్న ఆశలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ ఇంటి ఓనర్ అయింటువంటి అశ్విన్ తండ్రి యొక్క కనస్ట్రక్షన్ కంపెనీ లో పని చేస్తూ ఉంటాడు. సినిమా మొదట్లో అశ్విన్ ప్రేమించిన అమ్మాయి వేరే వారితో వెళ్ళిపోవడం తో నిరాశకు గురయిన అశ్విన్ ని డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా రత్న పనిమనిషి గా తన సేవలను అందిస్తుంటుంది.

అశ్విన్ పర్సనల్ కాల్స్ ని రిసీవ్ చేసుకోవడం, మధ్య రాత్రిలో అశ్విన్ కి బ్లాంకెట్ కప్పడం, బయట అశ్విన్ గురించి అనుకుంటున్న మాటలను ఖండించడం.. చెల్లి పెళ్ళికి మూడురోజులు మాత్రమే ఉండి తన కోసం పరిగెత్తుకొచ్చిన రత్న తో ప్రేమలో పడిపోతాడు అశ్విన్. తన ఆశయాలకు విలువిస్తాడు. రత్న కూడా అశ్విన్ ని సర్ అని పిలుస్తూనే అతన్ని గౌరవిస్తుంటుంది. చివరకు అతని పై ప్రేమ ఉన్నా సమాజం యొక్క దృష్టిలో తమ ప్రేమ కు విలువ దొరకదనే ఉద్దేశ్యం తో అశ్విన్ ని దూరం చేసుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే అశ్విన్ తండ్రి, స్నేహితులు కూడా సమాజం యొక్క కోణం లోనే అశ్విన్ ని నిలువరిస్తారు. అయితే వీరెవరూ అశ్విన్ యొక్క ఇతర అలవాట్లను వ్యతిరేకించరు.

Tillotama Shome film Sir to release on Netflix | Entertainment News,The Indian Express
  • Facebook
  • Twitter
  • reddit

ఎంతటి ఉన్నత భావాలున్నా, ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద బంగలాల్లో ఉన్నా.. తమ చుట్టూ గిరిగీసుకొని కూర్చున్న జనాల మధ్య నుండి తిరిగి దూరం గా వెళ్ళిపోతాడు అశ్విన్.. తన ఇంటి పనిమనిషి అయినటువంటి రత్న (తిలోత్తమ షోమే) ని ప్రేమించిన ఉన్నతభావాలు గల అశ్విన్ (వివేక్ గోంబర్) చివరకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా సమాజం యొక్క ఒత్తిడిని అధిగమించలేక, రత్న ని ఒప్పించలేక అమెరికా కి వెళ్ళిపోవడం నిరాశ పరుస్తుంది. అయితే రత్న ఆశయాలకు విలువనిస్తూ తనకి ఒక దారి చూపించడం అభినందించదగ్గ విషయం. ఎవరికి తెలుసు.. రత్న అనుకున్న విధం గా ఫ్యాషన్ డిజైనర్ అయితే అమెరికా నుండి పరిగెత్తుకొస్తాడేమో..

పనితనం:

డొమినిక్ కొలిన్ కెమెరా పనితనం, జాక్వెస్ కొమెస్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి.. రోహెన్ గెరా స్క్రీన్ ప్లే సినిమా కి ఒక కొత్త ఒరవడిని చేకూరుస్తుంది. ముఖ్యం గా గెరా స్క్రీన్ ప్లే కి డొమినక్ కెమెరా తోడవ్వడం ఈ సినిమా కి ప్లస్ పాయింట్స్.. పెద్ద పెద్ద బంగాళాల్లో ఉన్న వారి ఇరుకు మనస్తత్వాన్ని పనిమనిషి యొక్క విశాలమయిన చిన్న గదిని పోలుస్తూ సమాజం లోని అంతరాలను ప్రస్పుటం గా చూపిస్తుందీ చిత్రం.

ప్రతీ సన్నివేశం తో అశ్విన్ మరియు రత్న ల మధ్య దూరాన్ని తగ్గిస్తూ వచ్చి చివరకు ఇద్దరూ ఒకరినొకరు చేరుకోలేని దూరం తో కథని ముగిస్తుంది గెరా.. రత్న గా తిలోత్తమ షోమే నటన ఆకట్టుకుంటుంది. వివేక్ గోమబరే అశ్విన్ గా తన పరిధి లో నటించాడు.

చాలా రోజుల తరువాత ఒక ఫీల్ గుడ్ సినిమా చూసిన అనుభవాన్ని మిగులుస్తూనే ఇంకా సమాజం లో పాటుకుపోయిన అంతరాలను స్పృశిస్తూ హృద్యo గా సాగిపోతుంది ఈ ఇండీ సినిమా.. (నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని చూడవచ్చు)

ట్రైలర్:

Was this helpful?

About Author /

Customer Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%
0
0%
    Showing 0 reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This