లక్ష్మి – కొత్త సీసా లో పాత సారాయి

అక్షయ్ కుమార్, కియార అద్వానీ జంటగా నటించిన “లక్ష్మీ” ఉరఫ్ “లక్ష్మీ బాంబ్” దీపావళి సంధర్భం గా రిలీజయి తుస్సుమన్నది. తమిళ్, తెలుగు, కన్నడ లో చాలదన్నట్టు ఇప్పుడు హిందీ లోకూడా విడుదలయి అన్నీ భాషలలో ఇరిటేట్ తెప్పించిన సినిమా గా “లక్ష్మి” నిలిచింది.. (కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Laxmmi Bomb: Release date, time, trailer and international premiere explained – HITC
  • Facebook
  • Twitter
  • reddit
ఈ ఫోటో వలనే ఉంది సినిమా కూడా.. (వెక్కిరిస్తుంది అందరినీ)

సినిమా పై ఇంటరెస్ట్ పెంచడానికి మేకర్స్ అన్నీ ప్రయత్నాలు చేశారు.. మొదట టీజర్ మరియు ట్రైలర్ వదలకుండా ఊరించారు. చివరి టైము లో ట్రైలర్ ని వదలి ఉత్సుకత క్రియేట్ చేయడం లో విజయం సాధించినా అది కేవలం హిందీ రీజియన్ కి మాత్రమే పరిమితం అయింది. తరువాత పేరు పై కాంట్రవర్సీ ఉందని చెప్పి, తరువాత కథ లో ముఖ్యాంశమయిన ట్రాన్స్ జెండర్ పై యూట్యూబ్ లో వీడియో ని వదలడం జరిగింది.

కానీ కంటెంట్, కథనం బాగాలేక పోతే ఏవీ సినిమాని కాపాడలేవన్న నిజం మరోసారి లక్ష్మీ విషయం లో ఋజువయింది. దాంతో పాటు హిందీ వారు సైతం ఇదివరకే డబ్ వెర్షన్ ని యూట్యూబ్ లో మరియు ఛానళ్లలో చూసి ఉండడం వలన ఓటీటీ లో ఎవరినీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే మాతృక నుండి ఎటువంటి కొత్తదనాన్ని చూపించకపోవడం, ఏమి జరుగుతుందో ముందే తెలిసిపోవడం, మరియు కొన్ని సీన్లలో అక్షయ్ కుమార్ తేలిపోవడం.. అక్షయ్ ముఖానికి సరిపోని మేకప్.. కియారా కేవలం కామెడీ కే పరిమితం కావడం.. కొత్తగా ప్రయత్నించిన లవ్ స్టోరీ మరియు కీయారా పేరెంట్స్ వద్ద కెళ్ళడం.. గ్రీన్ టీ తో అక్షయ్ కి దెయ్యాన్ని అంటగట్టడం.. అనీ కలిపి ఈడ్చి తన్నాయి మేకర్స్ ని..

ఆశ్చర్యం గా ఫ్లాష్ బ్యాక్ లో అసలయిన లక్ష్మీ పాత్ర పోషించిన “శరద్ కేల్కర్” తన నటన తో ఆకట్టుకోవడం జరిగింది. మిగిలిన ఏ పాత్రలు కూడా ఓవర్ ఆక్టింగ్ తో ఇరిటేట్ చేసాయే తప్ప సినిమా ఎందుకోసం చూడాలో చెప్పే ఎ ఒక్క అంశం లేకపోవడం ముదావహం.

ఇకపోతే ఆ పాటలు ఎందుకు పెట్టారో, సంధర్భం ఏమిటో తీసిన వారికే తెలియాలి.

Was this helpful?

About Author /

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This