Post Grid – Style 9

90

సూరారై పొట్రు – నేర్పే పాఠాలు..

ఒకవేళ మారన్ క్యారెక్టర్ ని నిజం గా బ్రాహ్మణుడిగా చూపిస్తే వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా పండే అవకాశముండకపోవచ్చు. హీరో మరియు విలన్ ల మధ్య అంతరాన్ని చూపించడానికి కథ లో చేసిన మార్పు కేవలం సినిమాటిక్ ఎఫెక్ట్ కి సృష్టించడానికి చేసిన ప్రయత్నం గా చెప్పవచ్చు. ఇటువంటి మార్పులు ‘సూరారై పొట్రు” లో చాలానే ఉన్నాయి.

30

మిస్ ఇండియా – రుచిగా లేని ఛాయ్

అమెరికా లో టీ బిజినెస్ చేయాలనుకోవడం.. దానికి మిస్ ఇండియా అని పేరు పెట్టడం.. అసలు ఆ ఆలోచన రావడం అమోఘం కదా.. మనవాళ్ళకే ఇంత మంచి ఐడియాలు ఎలా వస్తాయో నాకిప్పటికీ అర్థం కావట్లేదు.

15

లక్ష్మి – కొత్త సీసా లో పాత సారాయి

ఆశ్చర్యం గా ఫ్లాష్ బ్యాక్ లో అసలయిన లక్ష్మీ పాత్ర పోషించిన “శరద్ కేల్కర్” తన నటన తో ఆకట్టుకోవడం జరిగింది. మిగిలిన ఏ పాత్రలు కూడా ఓవర్ ఆక్టింగ్ తో ఇరిటేట్ చేసాయే తప్ప సినిమా ఎందుకోసం చూడాలో చెప్పే ఎ ఒక్క అంశం లేకపోవడం ముదావహం.

ఈ సమయాలు – చార్లీ చాప్లిన్ – ఖదీర్

‘గోల్డ్‌ రష్‌’లో నిర్మానుష్య అలాస్కా మంచు దిబ్బల మధ్య చాప్లిన్‌కు ఆకలి వేస్తుంది. ఒంటరి కేబిన్‌లో తోడుగా ఉన్న సాటి వేటగాడికి అప్పటికే ఆకలితో మతిపోయి ఉంటుంది. భ్రాంతులు కూడా కలుగుతుంటాయి. కాని చాప్లిన్‌ నింపాదిగా ఉంటాడు. తన కాలి షూ బాగా పొగలు…

పారసైట్ – వాసన – మహమ్మద్ ఖదీర్ బాబు

‘పారసైట్‌’ సినిమాలో శ్రీమంతుల ఇంటిలో వంచన కొద్దీ పనికి చేరిన అక్క, తమ్ముడు, తండ్రి బట్టల నుంచి ఒకే రకమైన వాసన వస్తూ ఉందని ఆ ఇంటి చిట్టి యువరాజు కనిపెడతాడు. అప్పుడే ఆ శ్రీమంతులు అలెర్ట్‌ అయి ఉంటే వారంతా ఒకే కుటుంబం నుంచి వచ్చినవారని గ్రహించి ఉద్యోగాలు ఊడగొట్టి ఉండేవారు. కాని ‘పేదవారి వాసన’ ఒకటే కావచ్చని పట్టించుకోరు. ఆ రాత్రి ఇల్లు చేరిన ఆ కిలాడీ కుటుంబం ‘ఇప్పుడేంటి.. మనం వేరు వేరు వాషింగ్‌ పౌడర్‌లతో బట్టలు ఉతుక్కోవాలా’ అని వాపోతుంది. ఎందుకంటే వారికి అది ఖర్చుతో కూడుకున్న పని.

90

ద క్వీన్స్ గ్యాంబిట్ – రివ్యూ మరియు కొన్ని ఆసక్తికర విషయాలు

ద క్వీన్స్ గ్యాంబిట్ – 1983 లో వాల్టర్ టెవిస్ వ్రాసిన ఈ నవలా డ్రామా అదే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో ఈ అక్టోబరు 23 న విడుదలయి నెంబర్ 1 సిరీస్ గా ప్రపంచవ్యాప్తం గా ప్రశంసలందుకొంటుంది. స్కాట్ ఫ్రాంక్ మరియు అలన్ స్కాట్ డెవెలప్ చేసిన ఈ మినీ సిరీస్ బెత్ హార్మన్ అనే కల్పిత బాల మేధావి అయిన ఒక అమ్మాయి పాత్ర చదరంగ సామ్రాజ్యాన్ని, చదరంగం లోని మహామహులను ఎలా ఢీ కొట్టిందో మరియు తన చెడు అలవాట్లను ఎలా జయించిందనే అంశాలతో కూడుకొని ఉంటుంది.

80

ఎమిలీ ఇన్ పారిస్ – రివ్యూ

లిల్లీ కొలిన్స్ ఎమిలీ గా నటించిన ఈ సిరీస్ మంచి వ్యూస్ నే కాకుండా విమర్శ లను కూడా ఎదుర్కొంటుంది. ఎందుకంటే పారిస్ ని ఒక అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించిన విధానం చాలా మంది ఫ్రెంచ్ వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఫ్రెంచ్ జనాలను కన్సర్వేటివ్స్ గా నెగటివ్ కోణం లో చూపించారనే అపవాదు ఈ సిరీస్ లో స్పష్టం గా కనిపిస్తుంది.

65

“కలర్ ఫోటో” – ఎలాఉందంటే..

విజయదశమి సంధర్భం గా రిలీజయిన ఏకైక తెలుగు చిత్రం “కలర్ ఫోటో”. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి “ఆహా” లో అక్టోబరు 23 న విడుదలయింది. సుహాస్ ఈ సినిమా తో ముఖ్య పాత్రధారిగా కనిపించగా, చాందినీ హీరోయిన్ గా నటించింది. సునీల్ విలన్ గా మొదటసారి ఈ చిత్రం లో కనిపించాడు. వీరితో పాటు వైవా హర్ష సుహాస్ తో సందడి చేయడం జరిగింది.

0

బీట్స్ ఆఫ్ “రాధే శ్యామ్” – ప్రభాస్ బర్త్ డే స్పెషల్..

అక్టోబరు 23, డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సంధర్భం గా “యూవీ క్రియేషన్స్” “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” పేరుతో మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.

60

“ద విచెస్” – తడబడిన రాబర్ట్ జెమెకిస్? (రివ్యూ)

కథనం బాగున్నా ఇటువంటి సినిమాలో అందరూ ఎదురు చూసే సినీ మ్యాజిక్ కొరత స్పష్టం గా కనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రాణం కేవలం కాన్ఫరెన్స్ హాలు లో జరిగే ఒకే ఒక సన్నివేశం మాత్రమే.. సినిమా మొదలు చప్పగా నిర్జీవం గా కొనసాగి కొంత నిరాశ కలిగిస్తుంది. కథ లో అసలు వేగం గ్రాండ్ విచ్ తన సభ్యులతో హోటల్ లోకి ప్రవేశించినప్పుడు మొదలయినా అది మిగతా సినిమా మొత్తం మోయ బడక పోవడం నిరాశ కలిగిస్తుంది.

80

రామరాజు ఫర్ భీమ్ – (RRR) హీటెక్కిస్తున్న టీజర్ ట్రైలర్

కొమరం భీమ్ 119 వ జయంతి సంధర్భం గా విడుదల చేసిన “ఆర్. ఆర్. ఆర్. – రామరాజు ఫర్ భీమ్” టీజర్ ట్రైలర్ ఉత్సుకతతో పాటు కాంట్రవర్సీ లను కూడా మోసుకువచ్చింది. అక్టోబర్ 22, 2020 ఉదయం 11 గంటల సమయం లో విడుదలయిన టీజర్ ట్రైలర్ మొదట మంచి టాక్ తో మొదలయి చివరకు ఎన్టీఆర్ పాత్రని ముస్లిం గెటప్ లో చూపించేసరికి చాలా మందికి కోపం నషాళానికి అంటింది.

0

బాలకృష్ణ “నర్తన శాల” ట్రైలర్?

విజయదశమి సంధర్భం గా ఈ “నర్తనశాల” సినిమా కు సంబంధించిన 17 నిమిషాల వీడియో ను రిలీజ్ చేస్తున్నట్టు బాలకృష్ణ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగం గా గురువారం దీనికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు.

వక్త్ నే కియా క్యా హసీ సితమ్ – ఖదీర్

వహిదా రెహెమాన్ గట్టిగా “నో” చెప్పాకే గురుదత్వా డెవాస్టేటెడ్ అయ్యాడని అంటారు. బే కరార్ దిల్ ఇస్ తర్హా మిలే…గురుదత్ ముందు నుంచీ డిప్రెషన్ పేషెంట్. జానీ వాకర్, దేవ్ ఆనంద్‌లతో స్నేహమూ, హాస్య ప్రియత్వమూ, కళను చూసి పురివిప్పే గుణమూ ఆ డిప్రెషన్‌ను దాటడంలో సహాయపడలేకపోయాయి. ఇవాళ ఉన్నవాళ్లు రేపు కూడా ఉంటారని నమ్మాడు.

రజనీగంధ ఫూల్ తుమ్హారే… ఖదీర్

సలీల్ చౌధురి చేసిన ఏ పాటైనా చూడండి, ఈ పాటతో సహా, మనల్ని కదిలిస్తాయి. వాన ఆగాక నీరు కుదళ్ల కడ సుడి తిరుగుతూ పారుతుందే అలా పారుతుంది అతడి పాట. రజనీగంధ చిన్న సినిమా. కాని పెద్ద సంగీతం ఇచ్చాడు. ఈ పాట రికార్డింగ్‌కు వచ్చినప్పుడు లతాకు పాట సాహిత్యం నచ్చలేదు. అంత బాగలేదు కదా అన్నది.