రామరాజు ఫర్ భీమ్ – (RRR) హీటెక్కిస్తున్న టీజర్ ట్రైలర్

కొమరం భీమ్ 119 వ జయంతి సంధర్భం గా విడుదల చేసిన “ఆర్. ఆర్. ఆర్. – రామరాజు ఫర్ భీమ్” టీజర్ ట్రైలర్ ఉత్సుకతతో పాటు కాంట్రవర్సీ లను కూడా మోసుకువచ్చింది. అక్టోబర్ 22, 2020 ఉదయం 11 గంటల సమయం లో విడుదలయిన టీజర్ ట్రైలర్ మొదట మంచి టాక్ తో మొదలయి చివరకు ఎన్టీఆర్ పాత్రని ముస్లిం గెటప్ లో చూపించేసరికి చాలా మందికి కోపం నషాళానికి అంటింది. ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర కొమరం భీమ్ తెలంగాణ గిరిజన యోధుడు కావడం, కానీ పోస్టర్ లలో మరియు టీజర్ చివరలో ముస్లిం గెటప్ లో కనిపించడం చాలా మందికి రుచించడం లేదు. 

కళాత్మక పరిధి కి ఫ్రీడం ముసుగు వేసి చరిత్రని వక్రీకరిస్తున్నారని చాలా సినిమాలు చిత్రీకరణ మరియు విడుదలయినపుడు వివాదాలు రేపిన మాట అందరికీ తెలిసినదే. అయితే దీన్ని చాలామంది సినిమా పబ్లిసిటీకి ఒక సాధనం గా మాత్రమే వినియోగించుకొని ముందు తరాల వారికి తెలియాల్సిన విషయాలను వక్రీకరిస్తున్నారని ఒక అపవాదు మాత్రం సినిమా ఇండస్ట్రీ చెరిపివేసుకోలేక పోతుంది. అందుకు ప్రయత్నిస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. 

ఎన్టీఆర్ గెటప్ ఎటువంటి సంధర్భం లో అలా ఉండవలసి వచ్చిందో విడుదల అయిన తరువాత తెలిసినా ఈ గ్యాప్ లో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే మేకర్స్ కావాలని టీజర్ లో పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇదికాకుండా ఆరు నెలల క్రితం “భీమ్ ఫర్ రామరాజు” టీజర్ విడుదల చేసినపుడు మాత్రం ఎటువంటి వివాదాలను రుద్దడానికి సాహసించలేదు ఫిలిమ్ మేకర్స్. 

దీంతోపాటు టీజర్ లో చాలా వరకు “నేషనల్ జియోగ్రఫీ” వారి స్టాక్ ఫుటేజీ ని టీజర్ లో స్వేచ్ఛగా వాడుకోవడం, చరణ్ వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ క్యాలీబర్ కి నప్పకపోవడం తో చాలామంది పెదవి విరుస్తున్నారు.

రాజమౌళి కాపీ కొట్టి మళ్లీ దొరికేశాడోచ్..
  • Facebook
  • Twitter
  • reddit

వీటన్నింటికీ చరమ గీతం పాడడానికి రాజమౌళి ఒక స్టేట్ మెంట్ తో వస్తాడో లేక అందరూ చర్చించుకోవాలని కొన్నాళ్ళు వేచి చూస్తారో చూడాలి.. ఎంతయినా సినిమా వాళ్ళు మేధావులు.. ఏమంటారు..?

Was this helpful?

About Author /

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This