బాలకృష్ణ “నర్తన శాల” ట్రైలర్?
బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో “నర్తనశాల” మొదలయి కొంతభాగం షూటింగ్ జరుపుకొనబడి అనివార్య కారణాలతో ఆగిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి సమయం వచ్చినప్పుడల్లా బాలకృష్ణ తన మానసాపుత్రిక “నర్తనశాల” గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఈ విజయదశమి సంధర్భం గా ఈ “నర్తనశాల” సినిమా కు సంబంధించిన 17 నిమిషాల వీడియో ను రిలీజ్ చేస్తున్నట్టు బాలకృష్ణ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగం గా గురువారం దీనికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు.
అర్జునుడిగా బాలకృష్ణ ఆకట్టుకుంటుండగా సౌందర్య మరియు శ్రీహరి ని చాలా రోజుల తరువాత చూడటం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ విజయదశమి సంధర్భం గా అక్టోబరు 24 న శ్రేయాస్ ఈటీ వేదికగా ఉదయం 11:49 నిమిషాలకు ఈ వీడియో ను వీక్షించవచ్చు.
Was this helpful?
Thanks for submitting your comment!