Cine Maaya
All About The Ultimate Movie World..

ది పర్ వెర్ట్స్ గైడ్ టు సినిమా(The Pervert’s Guide To Cinema) – Slavoj Zizek

CINEMA IS THE ULTIMATE PERVERT ART. IT DOESN'T GIVE YOU WHAT YOU DESIRE - IT TELLS YOU HOW TO DESIRE - Slavoj Zizek

imdb.org

ది పర్ వెర్ట్స్ గైడ్ టు సినిమా – సోఫీ ఫియెన్నెస్ 2006 లో నిర్మించి దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ స్లావో జిజెక్ అనే స్లొవేనియన్ ఫిలసాఫర్ యొక్క వ్యాఖ్యానం తో కూడుకొని ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ లో జిజెక్ చాలా సినిమాల్లోని సన్నివేశాలను మానసిక విశ్లేషణ సిధ్ధాంతాలతో మనకు పరిచయం చేస్తాడు.

ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రేక్షకుడిని మానసిక విశ్లేషణ తో కూడిన ఒక విధమయిన ఒళ్ళు గగుర్పొడిచే ప్రెజెంటేషన్ ద్వారా ఇంతకు మునుపెన్నడు కనీవినీ ఎరుగని విధంగా గొప్ప చిత్రాలను, అందులోని సన్నివేశాలను పరిచయం చేస్తాడు జిజెక్. జిజెక్ ఒక ఫిలసాఫర్ మరియు మానసిక విశ్లేషణ తత్వవేత్త. ఈ స్లొవేనియన్ ఫిలసాఫర్ మనకి సినిమా లో దాగున్న ఒక రహస్యమయిన భాష మరియు దాని వెనుకనున్న ఆలోచనావిధానాన్ని, దాని ద్వారా మన గురించి మనకు తెలియని విషయాలను సినిమా సన్నివేశాల ద్వారా వివరించడం ఆకట్టుకుంటుంది.

ది పర్వెర్ట్స్ గైడ్ టు సినిమా – స్లావో జిజెక్ యొక్క ఆలోచన లను మరియు ఫాంటసీ, రియాలిటీ, సెక్సువాలిటీ, కోరికలు, యాంత్రికత్వం, సినిమా కళ ల పట్ల జిజెక్ యొక్క ఐడియాలను మనకు పరిచయం చేస్తుంది. ఈ డాక్యుమెంటరీ లో డేవిడ్ లించ్ యొక్క అస్సాధారణమయిన గొప్ప సినిమాలను, మనకంతా తెలుసుననుకొనే హిచ్ కాక్ సినిమాల లో మనకసలు తెలియని నిగూఢాలను, తన తెలివి తో, నిజాయితీ తో కూడిన చతురతతో ఎక్కడా విఫలం చెందకుండా, సినిమా విశ్లెషణ యొక్క చరిత్ర లో నే ఒక అసాధారణమయిన అధ్యాయాన్ని మన ముందుకు తీసుకువచ్చి విశదీకరిస్తాడు జిజెక్.

ఈ డాక్యుమెంటరీ యొక్క మరొక గొప్పదనం, జిజెక్ సినిమాలను చిత్రీకరించిన ఒరిజినల్ లొకేషన్లలోనే ఉంటూ మనకు ఆ సినిమా లోని సన్నివేశాలను వివరిస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే జిజెక్ సినిమాలో నుండి మనతో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. దీని ద్వారా మనకు ఆ సినిమా ల యొక్క సన్నివేశాలు మరియు వాటివెనుక నున్న ఆలోచనా విధానాలు చాలా కూలంకషం గా అర్థమవుతుంది. ఈ డాక్యుమెంటరీ ద్వారా సోఫీ ఫియెన్నెస్ స్లావో జిజెక్ తో కలిసి సినిమా సన్నివేశాల లో దాగిఉన్న ఫ్రాయిడ్ సంకిష్ట భావనలను నిజాయితీ గా విశదీకరించడం చేస్తుంది.

సినిమా ని మానసిక విశ్లేషణ చేయడం ద్వారా ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఏయే విషయాలను అర్థం చేసుకోవాలి అనే ఒక ముఖ్యమయిన ఆలోచన ని మొలకెత్తించడం లో ఈ డాక్యుమెంటరీ కొత్త దర్శకులకి మరియు కొత్తదనం కోరుకొనే వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.

ట్రయిలర్: 

ఇచ్చట చూడండి:

Leave A Reply

Your email address will not be published.