Cine Maaya
All About The Ultimate Movie World..

Metropolis (1927) – మొట్ట మొదటి డిస్టోపియన్ ఫ్యూచర్ మూవీ??

cinemaaya.com

డిస్టోపియన్ (Dystopian) మూవీ – మన ఊహ కందని సమాజాన్నిలేదా వ్యవస్థ ని, మనం కోరుకోలేని మరియు భయం కలిగించే విధంగా విచిత్రమైన, ఊహాత్మకంగా చిత్రించబడే సినిమా. ఎక్కువగా ఇటువంటి చిత్రాలు భవిష్యత్తు ని ఊహించి చిత్రీకరించబడుతాయి. ఇటువంటి సినిమాలు మామూలుగా కొన్ని కొన్ని సంధర్భాలను ఆధారంగా చేసుకొని డెవలప్ చేయబడుతాయి. ఉదాహరణకు అమానవీయ సంఘటనలు, ప్రపంచం మొత్తాన్ని శాసించే భీతిగొలిపే ప్రభుత్వాలు, భయంకరమయిన మరియు ఊహకందని పరిశోధనలు చేసే కార్పోరేట్ కంపనీలు మరియు ప్రకృతి విలయాలు మొదలగునవి ఆధారంగా చేసుకొని ఈ సినిమాలు ఎక్కువగా రూపొందించబడుతాయి. అయితే మొట్టమొదటగా చితించబడిన డిస్టోపియన్ సినిమా ఏమిటి?

మెట్రోపొలిస్ (Metropolis) – 1927 జర్మనీ లో నిర్మించబడిన ఈ చిత్రం మొట్టమొదటి డిస్టోపియన్ చిత్రం గా గుర్తించబడుతుంది. ఇప్పటివరకు చాలా సినిమాలు భవిష్యత్తు లో జరిగేవాటిని ఊహించబడి చిత్రించబడ్డాయి. అలాంటి సినిమా లన్నీ ఈ చిత్రానికి, ఈ చిత్ర దర్శకుడయిన ఫ్రిట్జ్ లాంగ్ కి ఋణపడి ఉంటాయని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఒక నగర జీవితాన్ని చూపించే ఈ సినిమా తన సమకాలీన పరిస్థితులకు చాలా అడ్వాన్స్ గా ఒక వంద సంవత్సరాలకు ముందుండే జీవితాలను ముందే ఊహించి ఆవిష్కరించబడిన చిత్రం.

“Should I say now that I like Metropolis because something I have seen in my imagination comes true, when I detested it after it was finished?” – Fritz Lang

మెట్రోపొలిస్ ఒక సమకాలీన దర్పణం:

మెట్రోపొలిస్ 2026 వ సంవత్సర కాలానికి చెందిన కథ. కానీ ఈ సినిమాలో 1927 జర్మనీలో పరిస్థితులను అద్దంపట్టే విధంగా కథను రూపొందించడం జరిగింది. ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రం లో అప్పటి ప్రపంచ పరిస్థితులను, ఆ సమయం లొ జర్మనీ ప్రపంచానికి చూపించిన పీడకలలను వాటి యొక్క ప్రభావాలను జర్మనీ యొక్క ట్రేడ్ మార్క్ ఎక్స్ ప్రెషనిజం ను ఉపయోగించి దర్శకుడు తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం లో, మొదటి ప్రపంచ యుధ్ధం సృష్టించిన భయంకరమయిన తాజా ఙాపకాలను ప్రజలు మరవక మునుపే, నాజీ లు అధికారం చేపట్టే సమయానికి ముందు, ఒక నిరంకుశ ప్రభుత్వం ఏర్పడితే అది జర్మనీ దేశానికి చూపించగల పరిష్కారాలను ప్రతిపాదించడం జరిగింది.

కథా బీజం: ఈ చిత్ర దర్శకుడు ఫ్రిట్జ్ లాంగ్ 1924 లో అమెరికాను సందర్శించినపుడు, అప్పుడే కొత్తగా నిర్మిస్తున్న ఆకాశ హర్మ్యాలను, వాటి మీదినుంచి చీమల్లా కనిపిస్తున్న ప్రజలను చూసినపుడు తనకు కలిగిన ఐడియా ను ఈ చిత్ర కథ గా మలిచాడు. అందుకే ఈ చిత్రం లో ఆకాశహర్మ్యాలను ఒక సైన్స్ ఫిక్షన్ కథాంశం తో మన ముందుంచుతాడు. తెర పై మొట్టమొదటిగా ఆకాశహర్మ్యాలను ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం లో చూపించడం ఈ సినిమాతోనే ప్రారంభమయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్ మార్గదర్శకుడైన Eugen Schüfftan తొ లాంగ్ ఈ సినిమా కి కలిసి పనిచేసాడు. వీరిద్దరు కలిసి ఒక అతిశయోక్తి తో కూడుకున్న మన్ హట్టన్ నగరాన్ని, మోనోరైలు మరియు పెద్ద పెద్ద క్లాక్ టవర్ సెట్ మోడళ్ళను ఉపయోగించి మనుషులు ఆపరేట్ చేసే పెద్ద పెద్ద యంత్రాలను ఈ చిత్రం లో సృష్టించడం జరిగింది.

ఈ చిత్రం లో చూపించబడిన మెట్రోపొలిస్ పట్టణం యొక్క ఆర్కిటెక్చర్ ఆ సమాజం యొక్క అననుకూల వైఖరిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఇందులో పరిపాలించే శక్తి కలవారిని ఎత్తయిన టవర్స్ లో చూపెడుతూ, బలహీనమయిన నిమ్న వర్గాలను క్రిందనున్న అంధకారమైన మురికివాడలలో నివసిస్తున్నట్టు చూపిస్తాడు దర్శకుడు. జీవితం లో వారి వారి మార్గాలను కలుపుకోలేని ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి, ఫ్రెడెర్సన్ (ఆల్ఫ్రెడ్ ఏబెల్) మరియు నిమ్న వర్గానికి చెందిన మరియా (బ్రిగిట్ హెల్మ్), సమాజం లోని ఈ రెండు విభిన్న వర్గాల మధ్య కల అంతరాలను స్పృశిస్తూ, వారు ఏవిధంగా ఆ యాంత్రిక పట్టణం ప్రశాంతంగా నడవడానికి సహాయపడుతున్నారో చూపిస్తూనే ఫ్రెడెర్సన్ కుమారుడు మారియా ను చూసి ప్రేమించడాన్నియంత్రాలు పనిచేయకపోవడం తో పోలుస్తాడు దర్శకుడు.

మొట్టమొదటిసారి ఒక సినిమా లో కట్టింగ్ ఎడ్జ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ని చూపించిన సినిమా గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమా, టెక్నాలజీ కంటే మానవత్వం యొక్క భవిష్యత్తు పైనే మన నమ్మకాన్ని పెంచే విధంగా, ఆ వైపు మనలని పురిగొల్పే విధం గా వ్యక్తీకరించబడుతుంది. 21 వ శతాబ్దపు పట్టణాన్ని ఒక కపటమైన, ఎటువంటి కరుణలేని ఒక యాంత్రిక రాక్షసుని గా చిత్రీకరించాడు దర్శకుడు. ఇందులో చూపించిన Maschinenmensch (“machine-human”) తరువాతి కాలం లో Frankenstein (1931) లాంటి చాలా హాలీవుడ్ చిత్రాలకు మార్గదర్శకం గా నిలిచింది. యాంత్రికత్వమును ఒక అనారోగ్యం తో కూడిన బానిసత్వం గా మరియు మోసకారిగా వర్ణించబడిన ఈ సినిమా మొట్టమొడటి డిస్టోపియన్ ఫ్యూచర్ సినిమా గా గుర్తించబడి తరువాతి కాలం లో వచ్చిన చాలా ఇంగ్లీషు చిత్రాలకు ఒక మార్గదర్శనం గా నిలిచిందనడం లో అతిశయోక్తి లేదు.

ఈ సినిమా ద్వారా దర్శకుడు ఫ్రిట్జ్ లాంగ్ విఛ్చిన్నమైన జర్మనీ వ్యవస్థ ను ముందే ఊహించి దానిని ఒక వికట పండితుడు గా చూపించడానికి ప్రయత్నించినట్టు కనిపించినా, మొత్తం గా ఒక ఆశావహ దృక్పథాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని నడిపించినట్టు ప్రస్ఫుటమవుతుంది.

Metorpolis believes the human heart can triumph even when our dreams turn into oppressive nightmares, and for all its concerns, it sees a frightening beauty in the world of tomorrow.

సినిమా:

Leave A Reply

Your email address will not be published.

Click to Hide Advanced Floating Content
Click to Hide Advanced Floating Content