Cine Maaya
All About The Ultimate Movie World..

Blade Runner 2049 సినిమా చూసేముందు మీరు చేయవలసిన ముఖ్యమైన పని..

Harison Ford in Blade Runner (Warner Bros)

ఈ రోజు Blade Runner 2049 చూడటానికి థియేటర్ కి వెళ్తున్నారా??

అయితే మీరు మీరు చేయవలసిన ముఖ్యమైన పని పాత వెర్షన్ Blade Runner సినిమా చూసేయడమే.. ఎందుకంటే ఒక వేళ మీరు మొదటిసారి ఈ సినిమా ను చూస్తున్నట్టయితే ఈ సినిమా ని అర్థం చేసుకోవడం మీకు సవాలే.. అందుకోసం మీరు పాత సీక్వెల్ ని చూడటం చాలా మంచిది. ఒకవేళ ఇదివరకు చూసినా అందులోని కంటెంట్ రిఫ్రెషింగ్ కోసం మళ్ళీ చూడటం చాలా మంచిది.

ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది.. ఏ వెర్షన్ చూడాలి.. హాలీవుడ్ లో ఒక సినిమా బాగా పాపులర్ అయితే అదే సినిమా కి సంబంధించి వివిధ రకాలయిన వెర్షన్లు మార్కెట్ లో రిలీజ్ అవుతాయి..

అవి 1. ఒరిజినల్ సినిమా 2. డైరెక్టర్స్ కట్ 3. ఫైనల్ కట్

ఒరిజినల్ సినిమా అందరి కోసం రిలీజ్ చేయబడుతుంది.. దీని కోసం అందరి అభిప్రాయాలను, సెంటిమెంట్ లను పరిగణన లోకి తీసుకొని రిలీజ్ చేస్తారు.. సినిమా కి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ముగింపును ఇవ్వడం జరుగుతుంది. చాలా కేసుల్లో కథని సుఖాంతం చేస్తుంటారు.. Blade Runner ఒరిజినల్ వెర్షన్ 1982 లో రిలీజ్ అయింది. ఇది ఫిలిప్. కె. డిక్ అనే రచయిత రాసిన సైన్స్ ఫిక్షన్ పుస్తకం ఆధారం గా నిర్మించబడింది. ఇందులో ఒక Blade Runner స్పేస్ లో దొంగిలించబడిన ఒక షిప్ ని ఎలా పోరాడి తిరిగి భూమ్మీదికి తీసుకొచ్చాడనేది అసలయిన కథ. ఇందులో ఆర్టిఫీషియల్ జీవితాలను, వ్యక్తులను ఫిలసాఫికల్ గా 3 గంటల పాటు వర్ణించడం జరుగుతుంది. దీనిని చూడటం ఖచ్చితం గా ఒక సవాలే.. దీనిని చూడటం మళ్ళీ స్కూల్ లో జాయిన్ అయిన ఫీలింగ్ ని గుర్తుకు తెస్తుంది.. అందుకు మీరు రెడీయా..?

అదీకాక ఈ సినిమా అభిమానులు ఇందులో చూపించబడిన చాలా కట్స్ ని ఆమోదించకపోవడం వలన ఇప్పటివరకు Blade Runner ఎనిమిది (8) వెర్షన్స్ మార్కెట్లో రిలీజ్ అయినాయి. అందులో మూడు వెర్షన్స్ మాత్రమే ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. అవి 1. 1982 Blade Runner థియేటర్ రిలీజ్ వెర్షన్, 2. Blade Runner 1992 డైరెక్టర్స్ కట్ మరియు 3. Blade Runner 2007 ఫైనల్ కట్.. ఒక్క సినిమాకి కమిట్ అయితే హాలీవుడ్ లో మీరు బుక్కయినట్టే.. 😉 Blade Runner 2049 ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇందులో ఏదోఒకటి మళ్ళీ చూడవలసిందే.. అయితే ఏది చూడాలో ఒకసారి రివ్యూ చేద్దాం..

The original 1982 theatrical release:

1982 లో వచ్చిన ఈ థియేటర్ రిలీజ్ మూవీ లో స్టూడియో నిర్మాణ సంస్థ అందరి ఆమోదం కోసమని చేర్చబడిన సుఖాంతమయిన ముగింపు ని, అనవసరమయిన ఒక వాయిస్ ఓవర్ ని కలిగి ఉంటుంది. ఒరిజినల్ సినిమా ఎలాఉంటుంది అనే ఒక ఉత్సుకత ఉంటే తప్ప ఈ చిత్రాన్ని చూడక పోవడమే మంచిది. ఎందుకంటే ఈ సినిమా ని తీసిన డైరెక్టర్ రిడ్లీ స్కాట్ మరియు హీరో హారిసన్ ఫోర్డ్ కూడా దీన్ని చూడకని సజెస్ట్ చేస్తారు.. ఇందులో వచ్చే వాయిస్ ఓవర్ మీరు సినిమా ని మొత్తం ఎంజాయ్ చేయకపోవడానికి ఖచ్చితంగా కారణమవుతుంది. కానీ ఇందులో వేసిన నేచురల్ సెట్టింగులు మరియు ఆర్టిస్టిక్ ఫీలింగ్స్ కోసం చూడవచ్చు.

The 1992 director’s cut:

ఇందులో ఇబ్బందికరమయిన వాయిస్ ఓవర్ మరియు సుఖాంతమయిన ముగింపు ఉండదు.. ఇది ఒక రిలీఫ్.. కానీ ఇది డైరెక్టర్ ఇడ్లీస్కాట్ సారీ రిడ్లీస్కాట్ వెర్షన్.. ఎందుకంటే మన డైరెక్టర్ గారు మరో రెండు సీన్లు జతపరిచి మనలను గందరగోళం లోకి నెట్టేస్తారు.. ఒక డ్రీమింగ్ సీను మరియు ఒక యూనికార్న్ కి సంబంధించిన సీన్స్ మనలని కథ నుండి mislead చేస్తాయి.. అదీకాక ఇది ఒరినల్ వెర్షన్ వలనే ఇదికూడా గందరగోళం గా ఉంటుంది..

The 2007 final cut:

ఇది బాగా ట్యూన్ చేయబడిన చిత్రం.. ఇందులో mislead చేసే సీన్లని సరిచేయడం జరిగింది.. ఇందులో సుఖాంతమయిన ముగింపు మరియు వాయిఓవర్ లు ఎలాంటివి ఉండవు.. అయితే ఈ వెర్షన్ ని అయినా చూడవచ్చా.. అంటే ఖచ్చితం గా చూడమని చెప్పవచ్చు.. నేనే కాదు, ఈ సినిమా డైరెక్టర్ రిడ్లీస్కాట్ మరియు హీరో హారిసన్ ఫోర్డ్ లు కూడా ఈ వెర్షన్ ని చూసి ఆమోదయోగ్యమైనది గా స్టాంప్ వేశారు.. సో.. Blade Runner 2049 కి వెళ్ళేముందు మీరు ఈ వెర్షన్ ని తప్పకుండా చూడవచ్చు..

అయితే గమనించాల్సిన ఒక విషయం.. ఒక కళాకారుడికి తనివితీరనంత వరకు తన ప్రయత్నాలను మానుకోడనే ఒక విషయం ఈ చిత్రం ద్వారా రుజువు అవుతుంది. అదీకాక Blade Runner 2049 డైరెక్టర్ Denis Villeneuve కూడా తన చిత్రం పై వెర్షన్ కి సీక్వెల్ గా అభివర్ణించడం జరిగింది.

Blade Runner 2049 trailer: 

Leave A Reply

Your email address will not be published.

Click to Hide Advanced Floating Content
Click to Hide Advanced Floating Content