Cine Maaya
All About The Ultimate Movie World..

The Cabinet of Dr. Caligari (1920) – మొట్ట మొదటి పూర్తి నిడివి కల హారర్ చిత్రం..

The Cabinet of Dr. Caligari (1920)రాబర్ట్ వియెన్ (Robert Wiene) దర్శకత్వం వహించిన ఈ జర్మనీ మూకీ చిత్రం మొట్టమొదటి పూర్తి నిడివి కల హారర్ చిత్రం గా పరిగణించబడుతుంది. ఈ సినిమా కి వేసిన సెట్ డిజైన్ లు, గ్రేడింగ్, సెట్ పరిసరాలు మొదలగునవి ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించాయి.
 
ఈ సినిమా ద్వారా మొట్టమొదటిగా రాబర్ట్ వియెన్ ఒక కథాంశాన్ని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా చూపించడం లో తను పాటించిన సూక్ష్మమైన అంశాలు ఇప్పటికీ పలువురిని ఆశ్చర్యపరుస్తాయనడం లో అతిశయోక్తి లేదు. “నమ్మశక్యం కాని కథనం” అనే కాన్సెప్ట్ ని కుడా మొదటిసారిగా  ఈ సినిమాలో ఉపయోగించడం జరిగింది. ఈ సినిమా స్క్రీన్ రైటర్స్ అయినటువంటి హాన్స్ జానోవిట్జ్ మరియు కార్ల్ మేయర్ మొదటి ప్రపంచయుధ్ధ సమయం లో జర్మనీ గవర్నమెంట్ మీద నేరారోపణ చేస్తూ కాలిగరీ అనే ఒక విలన్ ప్రధానపాత్రధారిగా కథ రాయాలనుకున్నారు. నిద్రలో నడిచే అలవాటు కల ఒక అమాయకుడిని కాలిగరీ ఒక మర్డరర్ గా ఎలా మార్చాడనేది కథాంశం. అయితే సినిమా మొదలయ్యేసరికి కథ ఇంకా క్లిష్టం గా మార్చబడి కథ చివరలో ‘అనుకోని మలుపు’ అనే అంశాన్ని కూడా మొదటిసారిగా ఈ చిత్రం లో పరిచయం చేయడం జరిగింది.
 
కథానుసారం గా కాలిగరీ (వెర్నర్ క్రాస్) ఒక షోమాన్.. ఒక రోజు తను తెరిచిన శవపేటిక లో నుండి “సీజర్” అనే దెయ్యం బయటికొచ్చి తనను విడుదల చేసిన కాలిగరీ ని తన మాస్టర్ గా భావించి, తనకు అన్ని రహస్యాలు తెలుసునని, తనని ప్రేక్షకులు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతుంది. “అలన్” అనే వ్యక్తి తను ఎన్ని రోజులు బ్రతుకుతానని అడగ్గా “సూర్యాస్తమయం” వరకని చెప్తుంది. తెల్లారేసరికల్లా అలన్ తన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ఈ సినిమాలో మొదటిసారిగా ‘విధి ఆడే వింత నాటకం’ అనే కాన్సెప్ట్ ని కూడా వాడటం జరిగింది.
“భావ వ్యక్తీకరణ శైలి” ఎక్కువగా ఉన్న ఆ రోజులలో అటువంటి శైలులని తన చిత్రం ద్వారా రాబర్ట్ వియెన్ సినిమా కి పరిచయం చేయడం జరిగింది. డార్క్ నెస్ మరియు లైటింగ్ ని ఉపయోగించి కథ లో మెలో డ్రామా ని పండించడం ఈ చిత్రం లో మనం చూడవచ్చు. ప్రత్యేకంగా కాలిగరీ ముఖభావాలను క్లోజప్ లలో చూపిచడం, అందుకు లైటింగ్ ని సమ్ర్థవంతం గా ఉపయోగించి ఈ కథ ఒక హీరో మరియు విలన్ మధ్య జరుగుతున్న కథగా ఎలివేట్ చేయడం లాంటి టెక్నిక్కులను వాడటం జరిగింది. ఈ చిత్రం లో చెప్పుకోదగ్గ మరియొక విషయం బ్యాక్ గ్రౌండ్ సెట్స్. సెట్స్ ని వేసిన వాల్టర్ రైమన్, వాల్టర్ రోరిగ్ మరియు హెర్మన్ వార్మ్ కథలో సెట్టింగుల యొక్క పాత్ర ని, వాటిద్వారా ప్రేక్షకులని మాయ చేయడం వంటివి ఈ సినిమాలో ఉదహరించడం జరిగింది.
హిచ్ కాక్ “సైకో” కంటే మునుపే ఈ సినిమా ద్వారా రాబర్ట్ వియెన్ ప్రేక్షకులను విలన్ యొక్క మైండ్ లోకి తీసుకెళ్ళడం వంటివి పరిచయం చేసాడు. 
 
సినిమా: 
 
చూడవలసిన ఇతర చిత్రములు:
1913 – The Weapons of Youth
1923 – Raskolinikow
1924 – The Hands of Orlac

Leave A Reply

Your email address will not be published.