Cine Maaya
All About The Ultimate Movie World..

A Trip to the Moon (1902) – మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ కథా చిత్రం

Special Article:
నేడు చలన చిత్ర రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. సాంకేతిక విలువలు, నిర్మాణ విలువల తో పాటు చూసే సినిమా చూసే ప్రేక్షకుడిని ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్ళడానికి చేయవలసిన పనులన్నింటినీ నేడు సినిమా రంగం లో తీసుకురావడం జరిగింది. అయితే ఒక్కసారి సినిమా చరిత్ర ని గమనిస్తే మొదటినుండీ సినిమా ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడానికి పడిన తపన మొట్ట మొదటి సినిమానుండి కనిపిస్తుంది. ఈ సినీ ప్రయాణం మొదటగా 1902 లో జార్జ్ మిలెస్ (George Melies) అనే ఒక పారిస్ కు చెందిన షోమాన్ తన దగ్గరికి వచ్చే ప్రేక్షకులకు చూపించడానికి మరియు వారిని వినోదపరచడానికి చిన్న నిడివి కల సైలెంట్ ఫిల్మ్ ల ను తీయడం తో మొదలయింది. అలా తను తీసిన మొదటి చిత్ర రాజం “ఎ ట్రిప్ టు ద మూన్” (La Voyage dans la lune). 
ఈ చిత్రం విడుదల అయిన తర్వాత గొప్ప విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తం గా ప్రశంసలను పొందటం జరిగింది. ఈ చిత్రం ఎంతగా పాపులారిటీ ని సాధించిందంటే అంతకు ముందు ప్రదర్శింపబడిన కళారూపాలన్నింటిలోకెల్లా కథాపరంగా గానీ, సాంకేతికంగా గానీ ఎవరూ ఊహించనంతగా అందరినీ అబ్బురపరిచింది.సినిమా:

విశేషాలు: 

* ఈ కథ సినీ ప్రపంచం లో చిత్రీకరించిన మొట్తమొదటి సైన్స్ కథా చిత్రం గా గుర్తించబడింది.
* చిత్ర నిడివి 12 నిమిషాలు మరియు కథ గురించి చెప్పుకోవాలంటే ఒక సైంటిస్ట్ ల బృందం        చంద్రుడి మీదికి వెళ్లడానికి ఒక గన్ లాంటి యంత్రాన్ని తయారు చేసుకొని చంద్రుని మీదికి వెళతారు. అక్కడ జరిగిన సంఘటన లు, తిరిగి వారు భూమి మీదికి ఎలా తిరిగి వచ్చారనేదే కథాంశం.
* లూమియర్ బ్రదర్స్ సినిమా ను పరిచయం చేసిన కొద్దిరోజులకే తీయబడిన ఈ చిత్రం లో ఉపయోగించిన కెమెరా ట్రిక్కులు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. అలా ఉపయోగించిన ట్రిక్కులే తర్వాతి తరాల వారికి ఒక మార్గదర్శకం గా నిలిచిందండలో సందేహం లేదు.
* జార్జ్ మిలెస్ తన చిత్రం చూసిన వారందరికీ చంద్రుని మీదకు తీసికెళ్ళిన అనుభూతిని కలిగించాలని సంకల్పించుకున్నాడు.
* అంతరిక్ష ప్రయాణం గురించిన ఎలాంటి అవగాహన లేని రోజుల్లొనే ఒక మాన్ స్టర్ గన్ ని ఉపయోగించి చంద్రుని మీదికి ప్రయోగించవచ్చనే ఒక అబ్సర్డ్ కాన్సెప్ట్ ని విజయవంతంగా అమలుపరచగలిగాడు.
* ఈ చిత్ర కథ హెచ్. జి. వేల్స్ మరియు జూలెస్ వెర్న్ యొక్క రచనల ఆధారం గా చిత్రీకరింపబడింది. 
ఇతర విశేషాలు:
 
Genre:  సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ
Direction : జార్జ్ మిలెస్
Actors: జార్జ్ మిలెస్, బ్లుయెట్ బెర్నాన్, ఫ్రాంకోయిస్ లాల్మెంట్, హెన్రీ డెలానోయ్
Story : హెచ్. జీ. వెల్స్ మరియు జులెస్ వెర్న్ నవలల ఆధారంగా..
Before & After: ఇంతకుముందే జార్జ్ మిలెస్ 1896 లో Le Manoir du Diable (The Devil Castle) అనే ఒక షార్ట్ ఫిల్మ్ ని తీయడం జరిగింది. ఈ చిత్రం మొట్టమొదటి హారర్ చిత్రం గా పరిగణించ బడుతుంది. 1899 లో మిలెస్ Cinderella అనే చిత్రం కూడా తీసాడు. ఈ చిత్రం ఒక మూవీ లో పలు సీన్లు కలిగిన మొదటి చిత్రం గా గుర్తించబడింది. తరువాత 1904 లో జార్జ్ మిలెస్ జులెస్ వెర్న్ రాసిన కథ ఆధారం గా Whirling The Worlds అనే చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ చిత్రం లో ఒక సైంటిస్టుల బృందం తమ స్టీం ఇంజన్ లో సూర్యుని మీదికి వెళ్ళడాన్ని చిత్రీకరించాడు.
 
George Melies: జార్జ్ మిలెస్ తన థియేటర్ లో చాలా ప్రయోగాలు చేసేవాడు. తను వాడే కెమెరాలో మొట్టమొడటి సారిగా ఒక వస్తువు లేదా ఒక మనిషి పూర్తిగా మాయం కావడం లేదా తిరిగికనిపించడం మరియు ట్రాన్స్ ఫార్మ్ కావడం వంటి మ్యాజిక్ ట్రిక్కులని ఉపయోగించేవాడు. 
 
 
జార్జ్ మిలెస్ డైరెక్టర్ గా, రచయిత గా మరియు నటుడిగా 500 ల చిత్రాలలో నటించడమే కాకుండా సినీ మాధ్యమం లో సైన్స్ ఫిక్షన్, హారర్ మరియు సస్పెన్స్ వంటి జానర్ ల ను పరిచయం చేసిన పయనీర్ గా ఖ్యాతి గడించాడు. 
 
జార్జ్ మిలెస్ ఇతర సినిమాలు:
 
1896 – The Devils Castle
1902 – A Trip to the Moon
1904 – Whirling the Worlds
1912 – The Conquest of the Pole
 
చూడవలసిన ఇతర చిత్రాలు: 
1901 – The man with the rubber head
1910- A Trip to Mars
1927 – Metropolis
1933 – The Invisible man
1964 – First Men in the Moon
2011 – Hugo

Leave A Reply

Your email address will not be published.

Click to Hide Advanced Floating Content
Click to Hide Advanced Floating Content