Cine Maaya
All About The Ultimate Movie World..

గేమ్ ఆఫ్ థ్రోన్స్ – డ్రాగన్ యుధ్ధాన్ని పోలిన సన్నివేశాలు (Game of Thrones – The Dragon War inspired from other movies?)

 

గేమ్ ఆఫ్ థ్రోన్స్ – సీజన్ 7, 4 వ ఎపిసోడు లోని యుధ్ధ సన్నివేశాన్ని మీరు అందరు చూసేఉంటారు. మరీ ప్రత్యేకంగా డ్రాగన్ యుధ్ధ సన్నివేశ చిత్రీకరణ మనల్ని ఎంతగా ఉత్తేజితుల్ని చేస్తుందంటే.. అది చూస్తే తప్ప మనకి తనివి తీరనంత.. అయితే ఈ ఎపిసోడ్ ఇంకా చూడని వారికి మాత్రం ఈ ఆర్టికల్ ఒక స్పాయిలర్. కాబట్టి ఈ ఎపిసోడ్ చూడని వారు మొదటగా చేయవలసిన పని, అర్జెంట్ గా చూసేయడమే..
బాహుబలి సినిమాా చూసిన తరువాత చాలామంది ఆ సినిమా లోని యుధ్ద సన్నివేశాలు చాలా సినిమాలని పోలివున్నాయని కామెంట్ చేసారు, అది మీరు కూడా గమనించే ఉంటారు. అయితే ఈ విషయమై రాజమౌలి కామెంట్ కూడా మీరు వినే ఉంటారు. యుధ్ధసన్నివేశాలు ఎవరు తీసినా చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. ఎందుకంటే యుధ్ధం చేసే విధానం ఒకటయితే, అంతకుముందు తీసిన చాలా సినిమాల ప్రభావం, వాటిల్లో యుధ్ధరీతులని చూపించిన విధానం ముందు తరాల వారికి ఒక పుస్తకంగా ఉపయోగ పడుతుంది. వాటిని ప్రేరణగా తీసుకొని యుధ్దసన్నివేశాలను చిత్రీకరించడం లో నాకు తెలిసి ఏ విధమయిన తప్పు లేదు. కానీవందకి వందశాతం కాపీ కొట్టాలనుకోవడం తప్పు. ఈ పురాణం ఎందుకు చెపుతున్నానంటే గత వారం చూసిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, 7 వ సీజన్ లోని 4 వ ఎపిసోడ్ లో ని యుధ్దసన్నివేశాలు కూడా అంతకుముందు తీసిన సన్నివేశాలని తలపిస్తాయి.
“గేమ్ ఆఫ్ థ్రోన్స్” మరియు “స్టేజ్ కోచ్” అనే చిత్రం లోని ఒకేవిధమయిన సన్నివేశం

 

అయితే ఈ యుధ్ద సన్నివేశం లోని ఒక్కొక్క షాట్ అంతకుముందు వచ్చిన సినిమాల్లోని సన్నివేశాలతో ఎలా పోలిక కలిగివున్నాయో వివరించి చెపుతూ ఒక వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. నెర్డ్ రైటర్ అనే ఒక సినీ విమర్శకుడు తయారు చేసిన ఈ వీడియోలో యుధ్ధసన్నివేశాలున్న చాల సినిమాలను గుర్తుచేస్తూ “ఇదివరకు తీసిన సినిమా ల్లోని సన్నివేశాలను రిఫరెన్స్ గా తీసుకొని కొత్త సన్నివేశాలను చిత్రీకరించడం లో ఎటువంటి తప్పులేదని చెపుతూ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒక్క యుధ్ధ సన్నివేశం లోనే ఎన్నో చిత్రాల తాలూకు సన్నివేశాలను గుర్తుచేస్తుందని మరియు అలాతీయడం కూడా కత్తి మీద సాములాంటిదని, ఆ విషయం లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ విజయం సాధించిందని” కొనియాడతాడు.

 అలా తను కూర్పు చేసిన వీడియో మీకోసం..

Leave A Reply

Your email address will not be published.