ఇంటోలెరెన్స్ (1916) – మొట్ట మొదటి ఎపిక్ మూవీ ???

Intolerance (1916) – మొట్ట మొదటి భారీ గా నిర్మించబడిన చిత్రం. ఈ చిత్ర దర్శకుడు D. W. Griffith అత్యంత భారీ సెట్టింగులు మరియు లెక్కకు మించి జూనియర్ ఆర్టిస్టు లను ఉపయోగించి ఆ రోజుల్లోనే సంచలనాలకు మారు పేరు గా నిలిచాడు. దర్శకుడు ఈ చిత్రం లో ఉపయోగించిన కెమెరా ట్రాకింగ్ షాట్స్ మరియు క్లోజప్ షాట్స్ అందరినీ అబ్బుర పరుస్తాయి. అందుకే సినీ ప్రేక్షకులందరూ గ్రిఫిత్ ని “Father of Modern Movie Making” అని కొనియాడుతారు.

Genre: హిస్టారికల్ ఎపిక్

Director: డి. డబ్ల్యు. గ్రిఫిత్

Writers: డి. డబ్ల్యు. గ్రిఫిత్, అనితా లూస్

Stars: వెరా లూయిస్, రాల్ఫ్ లూయిస్, లిలియన్ గిష్, రాబర్ట్ హారన్

Before & After: 1914 లో ఇటాలియన్ డైరెక్టర్ జియోవాని పాస్త్రోనె నిర్మించిన Cabiria, మొట్టమొదటి పూర్తి నిడివి కల చిత్రం, 1915 లో గ్రిఫిత్ నిర్మించిన A Birth of a Nation, US లో నిర్మించిన మొదటి చిత్రం మరియు మొదటి కాంట్రవర్సీ చిత్రం.

1931 లో గ్రిఫిత్ నిర్మించిన చివరి సినిమా, The Struggle, దారుణంగా పరాజయం పాలయింది. ఈ సినిమా ఒక సెమీ ఆటోబయోగ్రఫీ చిత్రం, ఆల్కహాలిజం పైన తీసిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయింది.

సినిమా:

విశేషాలు:

ఈ చిత్ర దర్శకుడు అంతకు ముందు నిర్మించిన చిత్రం “బర్త్ ఆఫ్ ఎ నేషన్” (1915) అమెరికా లో నిర్మించబడిన మొదటి పూర్తి నిడివి గల చిత్రం గా పరిగణించబడుతుంది. కానీ ఆ చిత్రం పరాజయం పాలవడమే కాక దర్శకుడికి ఆర్థిక ఇబ్బందులను కలిగించింది. అయితే ఆ ఇబ్బందులను ఈ చిత్ర విజయం తో గ్రిఫిత్ రూపుమాపాడు. 

* ఈ చిత్రం పలు కాంట్రవర్సీ లకు కారనమయింది. దీనికి కారణం ఈ చిత్రం లో పెద్దయెత్తున చూపించబడిన రేసిజం మరియు బానిసత్వం . కానీ వీటన్నింటినీ తోసిరాజని ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించడంతో చాలా మంది విమర్శకుల నోరు మూయించింది. 

* ఈ చిత్రం లో 4 ఉప కథలు ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి.. కానీ నాలుగు వివిధ కాలాలకు చెందిన కథలను ముడివేయడం లో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది.

This image has an empty alt attribute; its file name is Intolerance%2B1.jpg
  • Facebook
  • Twitter
  • reddit

నిశితం గా గమనిస్తే ఒక్కొక్క కథ కు ఒకరకమయిన కలర్ టింట్ ని వాడటం జరిగింది దర్శకుడు. 

* మొదటి కథ ప్రాచీన బాబిలోన్ సామ్రాజ్య పతనానికి కారణమయిన ఘర్షణ లు మరియు దానికి బీజం వేసిన రెండు అసహనం కలిగిన మత వర్గాల గురించినది. 

* రెండవ కథ అసహనం జీసస్ మరణానికి ఎలా కారణమయింది అని…

* మూడవ కథ 1572 ఫ్రాన్స్ లో జరిగిన సెయింట్ బార్తోలోమ్యూస్ ఊచకోత మరియు దానికి కారణమయిన కాథలిక్కులు చేసిన ప్రొటెస్టెంట్ ల దమనకాండ ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.

* ఇక చివరిదయిన నాల్గవ కథ, దయాదాక్షిణ్యం లేని క్యాపిట్లిస్టులు మరియు వారికి ఎదురు తిరిగిన నిజాయితీ కల వర్కర్ల మధ్య నలిగి పోయే ఇద్దరు ప్రేమికుల గురించినది. 

* అయితే ఈ చిత్రం లో గమనిచదగినది స్క్రీన్ ప్లే.. పైన చెప్పిన నాలుగు కథలని స్ట్రెయిట్ గా చెప్పకుండా దర్శకుడు ఒకదానికొకటి ఇంటర్ లింక్ చేయడం మరియు కథ ఎక్కడా ఆగకుండా క్లైమాక్స్ వరకు తీకికెళ్ళడం వర్ణణాతీతం. ఎడిటింగ్ టెక్నిక్కులను మొదటిసారిగా ఈ చిత్రం లో సమర్థవంతం గా ఉపయోగించడం చూడవచ్చు. ఉదాహరణ కు మొదటి కథ నుండి రెండవ కథకు లింకు గా మొదటి కథలోని రథాల పరుగు ని రెండవ కథలోని ట్రైయిన్ మరియు కార్ల పరుగుతో లింక్ చేసి ఎడిటింగ్ చేయడం మొదలయినటువంటివి విమర్శకుల మన్ననలను పొందటం జరిగింది. 

* ఈ సినిమా తో మొదటిసారిగా కథ ను చెప్పడం లో ఎడిటింగ్ పాత్ర అందరికీ అర్థమయింది. 

* చివరిగా చెప్పుకోదలచుకోవలసింది ఈ చిత్రం లో ఉపయోగించిన క్లోజప్ షాట్స్ మరియు లాంగ్ షాట్స్.. వాటితో కథ ని చెప్పిన తీరు, దానికి ఉపయోగపడిన dissolve, fade-in & fade-out టెక్నిక్కులు. 

This image has an empty alt attribute; its file name is Intolerance%2B1.jpg
  • Facebook
  • Twitter
  • reddit

D. W. Griffith: కెంటకీ లోని ఒక ఫామ్ హౌస్ లో 1875 లో జన్మించిన గ్రిఫిత్ తన పదేళ్ళ వయసు లో నే తండ్రిని కోల్పోవడంతో పేదరికం తో బాధ పడ్డాడు. తర్వాత చాలా సంవత్సరాలు వివిధ నాటక కంపెనీ లలో పని చేసిన తనకు 1908 లో ఒక మూవీ సంస్థ లో ఉద్యోగం దొరకడం తో, ఆ సంస్థ హాలీవుడ్ లో నిర్మించిన పలు మొట్టమొదటి చిత్రాలకి తను కూడా పని చేయడం జరిగింది.

This image has an empty alt attribute; its file name is D.W.%2BGriffith.jpeg
  • Facebook
  • Twitter
  • reddit

తర్వాత గ్రిఫిత్ తన సొంత సంస్థ ని ఏర్పరచి మొదటగా “ది బర్త్ ఆఫ్ ఎ నేషన్

అనే చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఆ చిత్రం లో చూపించిన రేసిజం పలు ఘర్షణలకి దారి తీసింది. గ్రిఫిత్ మొత్తం గా 500 చిత్రాలని నిర్మించగా, ఇంటాలరెన్స్ చిత్రం మాత్రం అతని కెరీర్ లో నే చెప్పుకోదగ్గ చిత్రం గా పేరు గాంచింది. 

గ్రిఫిత్ ఇతర చెప్పుకోదగ్గ చిత్రాలు:

1909 – A Corner of Wheat

1915 – A Birth of a Nation

1916 – Intolerance

1919 – Broken Blossoms

చూడవలసిన చిత్రాలు:

1917 – Cleopatra

1919 –  Broken Blossoms

1927 – Sunrise

1927 – Metropolis

1936 – Modern Times

1939 – Gone with the Wind

1959 – Ben Hur

Was this helpful?

About Author /

కథ మరియు నవలా రచయిత, కాలమిస్ట్

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This